ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే రిస్క్ లేకుండా అదిరే లాభాలు పొందొచ్చు..!

-

రాబడి స్థిరంగా ఉంటుంది కనుక చాలా మంది డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యాలని అనుకుంటారు. అలానే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు. FD యొక్క లాక్-ఇన్ వ్యవధి 5 ​​సంవత్సరాలు. అయితే మధ్యలోనే విత్ డ్రాయల్ కు అనుమతి లేదు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఆకర్షణీమైన వడ్డీ వస్తుంది.

 

చిన్న ప్రైవేట్ బ్యాంకులు పన్ను పొదుపు ఎఫ్‌డిలో 6.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ వడ్డీ రేటు చాలా పెద్ద ప్రభుత్వ బ్యాంకుల కంటే ఎక్కువ. 6.75 శాతం వడ్డీ రేటుతో డిసిబి బ్యాంక్, యెస్ బ్యాంక్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 6.50 శాతం రేటుతో మూడవ స్థానంలో ఉంది.

అలానే ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వరుసగా 6.50 శాతం, 5.80 శాతం చొప్పున టాక్స్ సేవింగ్ ఎఫ్‌డిలను అందిస్తున్నాయి. అదే విధంగా అనేక ప్రధాన ప్రైవేట్ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటుతో ఎఫ్‌డిలను అందిస్తున్నాయి. విదేశీ బ్యాంకులు డిబిఎస్ బ్యాంక్, డ్యూయిష్ బ్యాంక్ కూడా 5.50 శాతం వరకు పన్ను పొదుపు ఎఫ్‌డిపై వడ్డీ ఇస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా వరుసగా 5.50 శాతం, 5.35 శాతం మరియు 5.30 శాతం చొప్పున పన్ను పొదుపు ఎఫ్‌డిపై వడ్డీని అందిస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 సంవత్సరాల పాటు పన్ను పొదుపు ఎఫ్‌డిపై అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది. ఇది 5.55 శాతం చొప్పున వడ్డీని ఇవ్వగా.. కెనరా బ్యాంక్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.50 శాతం మరియు 5.40 శాతం చొప్పున వడ్డీ ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా 5.25 శాతం వడ్డీ ఇస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version