ప్రభాస్- నాగ్ అశ్విన్ సినిమాపై సందేహాలు.. పిట్టకథలు ప్రభావమేనా?

Join Our Community
follow manalokam on social media

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నాడని ప్రకటన వచ్చినపుడు అందరూ షాకయ్యారు. మాస్ హీరో ప్రభాస్, క్లాస్ సినిమాలు చేసిన నాగ్ అశ్విన్ తో సినిమా చేయడమేంటని ఆశ్చర్యానికి లోనయ్యారు. అదీగాక 5వందల కోట్లతో సినిమా కావడంతో ఆ ఆశ్చర్యం మరింత పెరిగింది. కాలంలో ముందుకు వెళ్ళగలిగే కథాంశంతో సినిమా వస్తున్నదని లీకైంది. అంటే సైన్స్ ఫిక్షన్ జోనర్ అన్నమాట. ఐతే ప్రస్తుతం ఈ సినిమాలు జనాల్లో సందేహాలు మొదలయ్యాయి.

దానికి కారణం నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన పిట్టకథలు సిరీస్. నాలు కథల ఈ వెబ్ సిరీస్ లో ఎక్స్ లైఫ్ అనే కథని నాగ్ అశ్వినే డైరెక్ట్ చేసాడు. ఇది కూడా సైన్స్ ఫిక్షన్ కావడం వల్ల ఈ సందేహాలు వస్తున్నాయి. ఎక్స్ లైఫ్ కథ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని, దానివల్ల ప్రభాస్తో సినిమా ఎలా డీల్ చేయగలడా అని అనుకుంటున్నారు. కానీ వెబ్ సిరీస్ కి సినిమాతో పోల్చలేం. కాబట్టి ప్రభాస్ తో సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వీరలెవెల్లో జరిగిపోయింది. ప్రతీదీ పక్కా ప్లానింగ్ ప్రకారమే వెళ్తున్నారు. అందుకే ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు. కాబట్టి అలా భయపడాల్సిన అవసరమే లేదని కొందరు వాదిస్తున్నారు.

TOP STORIES

EPF: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్… వివరాలు ఇవే…!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది జీతం ఉన్న వ్యక్తుల కోసం ప్రభుత్వ యాజమాన్యం తో నడిచే పెన్షన్ ప్లాన్. దీంతో ప్రతి నెల 12...