సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ : అరబిందో కంపెనీ జరిమానా !

టాలీవుడ్ యంగ్ హీరో, మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ వినాయక చవితి పర్వ దినాన రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 45 నుండి గచ్చిబౌలి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అతివేగం తో వెళ్ళడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్.. అపోలో ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా.. హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ఉన్నతా ధికారులు. రోడ్ల మీద వ్యర్థాల ను వేస్తున్న వారి పై కొరడా విధించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇందులో భాగంగానే మాదాపూర్ ఖానామెట్ లో నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్స్రక్షన్ కంపెనీ కీ లక్ష రూపాయల జరిమానా విధించారు అధికారులు. అరబిందో కన్స్రక్షన్ కంపెనీ కారణంగా వ్యర్థ పదార్థాలు వస్తున్నాయని,,, అవి రోడ్లపైనే ఎక్కువగా కనిపిస్తోన్న నేపథ్యం లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధియారులు చెబుతున్నారు.