దిల్లీ లిక్కర్ స్కామ్.. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి అరెస్ట్

-

దిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై ఈడీ, సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ లిక్కర్ స్కామ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఏపీకి చెందిన శరత్‌ చంద్రారెడ్డి, తెలంగాణకు చెందిన మద్యం వ్యాపారి వినయ్ బాబులను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. శరత్‌, వినయ్‌బాబుకు కోట్ల రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ తెలిపింది. శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపెనీలో కీలక డైరెక్టర్‌గా ఉండగా.. వినయ్‌బాబు మద్యం వ్యాపారం చేస్తున్నారు.

సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో దిల్లీలో శరత్‌ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈయన అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మద్యం కుంభకోణంలో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ కేసులో పెనాక శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ క్రమంలోనే ఆయణ్ని విచారించిన ఈడీ ఇవాళ అరెస్టు చేసింది. దిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు చెల్లించారు.

Read more RELATED
Recommended to you

Latest news