WTC ఫైనల్ 2023 : 469 పరుగులకు ఆస్ట్రేలియా ఆల్ అవుట్

-

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 లో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఒకటైనా రోజుపాటు బ్యాటింగ్ చేసి 469 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఒక దశలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా వెళుతుంది అనుకున్నారు.. కానీ సరైన సమయంలో ఇండియా బౌలర్లు సమర్ధవంతమగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా ఆటలు సాగనివ్వలేదు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో స్మిత్ (121) మరియు హెడ్ (163) లు సెంచరీలతో చెలరేగగా వీరికి వార్నర్ (43), క్యారీ ల నుండి చక్కని సహకారం లభించింది. ఇక ఇండియా బౌలర్లలో సిరాజ్ ఒక్కడే 4 వికెట్లు తీసుకోగా, షమీ మరియు శార్దూల్ ఠాకూర్ లు తలో రెండు వికెట్లు తీశారు. ఇక స్పిన్నర్ గా రాణిస్తాడు అనుకున్న జడేజా కేవలం ఒక వికెట్ తోనే సరిపెట్టుకున్నాడు.

ప్రస్తుతం ఇండియా ముందు చాలా పెద్ద టార్గెట్ ఉంది. ఈ స్కోర్ ను అందుకుని.. లీడింగ్ ఎంతో కొంత స్కోర్ ఇస్తే కానీ విజయంపై ఆశలు పెట్టుకోవడం తగదు.

Read more RELATED
Recommended to you

Latest news