ఇటీవల తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. 2023 జూన్ 12 వ తేదీ నుండి 20 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు మొత్తం 933 సెంటర్లను ఏర్పాటు చేసినట్లుగా ఇంటర్ బోర్డు వెల్లడించింది. మొత్తం 4లక్షల 12 వేల 325 మంది విద్యార్థులు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నారు.
ఇందులో 2 లక్షల 70 వేల 583 మంది విద్యార్థులు ఫస్ట్ ఈయర్ పరీక్షలు రాయనుండగా, 1 లక్ష 41 వేల 742 మంది విద్యార్థులు సెంకడ్ ఈయర్ పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఈయర్, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్ సెకండ్ ఈయర్ పరీక్షలు జరగనున్నాయి.
వాస్తవానికి 2023 జూన్ 04 నుంచే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ప్లాన్ చేసింది. అయితే జూన్ 04న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు ఉండటం వలన సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసింది.