విశాఖ వైసీపీ కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఎన్నికల్లో అభ్యర్థులు ఎంపిక, పార్టీలో ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తే అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. అనంతరం ప్రతీ నియోజక వర్గానికి పరిశీలకుల నియమించారు. ఈ సంధర్భంగా టీడీపి మాకు పోటీ కాదు….వైసీపీలోనే ఎక్కువ మంది టిక్కెట్లు ఆశిస్తున్నారు అంటే మాతో మాకే పోటీ అని అర్ధం వచ్చేలా మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
పథకాలు, వాలంటరీ వ్యవస్థ ద్వారా 80శాతం మందికి లబ్ధి చేకూరుతోందన్న ఆయన ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీరియస్ గా వర్క్ చేసి నూరు శాతం సీట్లు సాధించాలని చర్చించామని, గెలుపు గుర్రాలకే అభ్యర్థులుగా ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నామని అన్నారు. అన్ని గ్రామాల్లో 80 నుంచి 90 శాతం ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధి పొందారని, ఈ ఎన్నికల్లో గెలుపు ఏకపక్షం.మా పార్టీ లోనే పోటీ ఎక్కువగా ఉందని అన్నారు. అపోజిషన్ పార్టీ కి చాలా గ్రామాల్లో అభ్యర్థులు లేరని నాయకులను ఏకతాటిపైకి తీసుకు వచ్చి వీలైనన్ని ఎక్కువ స్థానాలను ఏకగ్రీవానికి తీసుకొస్తామని అన్నారు.