1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే భారత ప్రజలు గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. కరోనా వ్యాప్తి కారణంగా గతేడాది జరిగిన చేదు అనుభవాలను గుర్తు చేసుకుని భారత ప్రజలు కోవిడ్-19 వైరస్ నిబంధనలు పాటిస్తూ.. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించుకున్నారు. వైరస్ వ్యాప్తి జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించారు. ముఖానికి మాస్కులు ధరించడం సామాజిక దూరం పాటిస్తూ వేడుకలు నిర్వహించుకున్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేడుకలను రద్దు కూడా చేశారు.
దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాయి. భారత సైనికులు, ప్రజాప్రతినిధులు, పాలకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ విద్యాసంస్థలు తదితరులు పరేడ్ నిర్వహించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ మేరకు కొందరు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తమ అభిమానులతో పంచుకున్నారు. మరికొందరు రిపబ్లిక్ డేపై ఫన్నీ మీమ్స్ తయారు చేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ పోస్టులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Thai Manne Vanakkam 🙏🏻
Happy Republic Day! 🇮🇳#AllInForChennaiyin #HappyRepublicDay pic.twitter.com/JHTD4Jw00n
— Chennaiyin FC 🏆🏆 (@ChennaiyinFC) January 26, 2021
రిపబ్లిక్ డే సందర్భంగా రేర్ లెజండ్ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసిన ఫోటోని చూస్తే నవ్వని వాళ్లు ఉండరూ. ఇందులో టీచర్ ఏమంటాడంటే.. అందరూ పిల్లలు చెరొక లడ్డు తీసుకుని ఇంటికి వెళ్తారు. కానీ అందులో ఓ పిల్లాడు మూడో లడ్డు కోసం ప్రయత్నిస్తున్నా.. అని చెబుతూ హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పుకొచ్చారు.
#HappyRepublicDay2021
My favourite …. 🐫 🐫 pared pic.twitter.com/8y9zpGE5Xj— kishan (@kishanSharma85) January 26, 2021
అథుల్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు. ఇందులో.. ‘‘నేడు రిపబ్లిక్ డే పరేడ్‌ని చూస్తున్నప్పుడు..’’ అని స్పెడర్ మ్యాన్ మూవీలో చేతి రోమాలు నిక్కపొడిచే ఫోటోని పోస్ట్ చేశాడు. కిషన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ.. ‘‘ నాకెంతో ఇష్టమైన పరేడ్ అని చెప్పుకొచ్చారు. ఇందులో భారత సైనికులు ఒంటెపై విన్యాసాలు చేస్తూ పరేడ్ నిర్వహిస్తున్నారు.
Teacher -: Sabhi bachhe ek-ek "Laddu" lekr ghar jayenge
*Me, Trying to take "Laddu" for the 3rd time
#HappyRepublicDay2021 pic.twitter.com/FG6FfPnUu1— Rare_Legend ° (@memer_hu__bc) January 26, 2021