క్రేజీ బ్రేకింగ్ న్యూస్: “మెగా ప్రిన్స్” వరుణ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ లాక్… !

-

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ్ మంచి మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్ లో డెవలప్ అయ్యే పనిలో ఉన్నాడు. తాజాగా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తో చేస్తున్న సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రవీణ్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వస్తున్న గాండీవదారి అర్జున సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే… ఆగష్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రణాళిక చేసుకుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్, టీజర్ విశేషంగా ఆకట్టుకోగా సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఫ్యాన్స్ వాటి చేస్తున్నారు. కాగా ఇందులో వరుణ్ తేజ్ కు జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news