వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లిన అవినాన్ను దాదాపు 7 గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. వివేకా హత్య రోజు వాట్సాప్ కాల్స్‌పై సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. అవినాశ్‌రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
ఇటీవల విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎంపీ అవినాశ్‌రెడ్డి విషయంలో సీబీఐ రోజుకో డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు అవినాశ్‌రెడ్డి రోజుకొక డ్రామా ఆడుతున్నట్టున్నారని కొందరు విలేకరులు ప్రశ్నించగా, ‘డ్రామాలాడుతున్నది సీబీఐ.. తాము కాదు’ అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తయారుచేశామని, త్వరలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో కొత్తగా డిజిటల్ క్లాస్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఎనిమిదో తరగతి పిల్లలకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు అందుబాటులోకి తేబోతున్నామని మంత్రి బొత్స అన్నారు.