ఒడిశా రైలు ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ఈ ఘోర విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దీంతో పాటు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అలాంటి ఘటన జరగడం దురదృష్టకరం’అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రమాద ఘటన పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రైలు ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను తాము పంచుకుంటామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని రష్యా అధ్యక్షుడు అన్నారు. రైలు ప్రమాద దృశ్యాలు కలవరపరిచాయని, క్లిష్ట పరిస్థితుల్లో భారత్ కు అండగా ఉంటామన్నారు కెనడా ప్రధాని. రైలు ప్రమాద ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పాక్ ప్రధాని అన్నారు. వివిధ దేశాల అధినేతలు కూడా ఈ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.