అయ్యప్పా నీకు ఇదేం కష్టమయ్యా…? కన్నీరు పెడుతున్న అయ్యప్ప…!

అయ్యప్ప మాలధారణ అంటే…? పూర్తిగా దీని గురించి తెలియకపోయినా చాలా మందికి కాస్త అవగాహన అనేది ఉంటుంది. పరుపు మీద నిద్రించకూడదు, వ్యసనాలు ఉండకూడదు, అన్నం నేల మీద కూర్చుని తినాలి, బూతులు మాట్లాడకూడదు, పాదరక్షలు ధరించకూడదు ఇలాంటివి ఉంటాయి. కాని ఈ రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది…? అయ్యప్ప కూడా కన్నీరు పెట్టె పరిస్థితికి దిగజార్చారు కొందరు భక్తులు. అవును ఇది నిజం… ప్రస్తుతం జరుగుతుంది చూస్తే అయ్యప్ప ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి… అసలు ఏంటి…?

ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోలో… పొగ త్రాగుతూ ఒక అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తి కనిపించాడు. వీడియో తీస్తున్నారు అని తెలిసినా సరే అతను అది ఆపలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాల ధరించిన వ్యక్తి మద్యం దుకాణం వద్ద… మద్యం తాగుతూ దర్శనం ఇచ్చాడు. ఈ వీడియో కూడా వైరల్ అవ్వడం అతనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక సామాన్యుల తీరు ఇలా ఆందోళన కలిగించే విధంగా ఉంటే… ప్రజాప్రతినిధులు, బాధ్యత గలిగిన వ్యక్తుల తీరు కూడా ఇలాగే ఉంది.

ఆంధ్రప్రదేశ్ మంత్రిగారు ఒకరు ఇటీవల పాదరక్షలు ధరిస్తూ దర్శనం ఇచ్చారు. అలా ఆయనకు సంబంధించి అనేక ఫోటోలు బయటకు వచ్చాయి. ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యులో పాల్గొన్న ఒక్క ఎమ్మెల్యే గారు అయితే మాల ధరించి బూతు పురాణం ఎత్తుకున్నారు. లైవ్ లో ఇది చూసిన భక్తులు అసలు ఇది ఏంటి… స్వామి శరణం అనుకున్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది మాల ధరించి తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు… మాల ధరిస్తే కరుణించే దేవుడు… నోరు,చేష్టలు అదుపులో లేకపోతే ఏ విధంగా కరుణిస్తాడు…?