ఇండోర్ వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ తొలిరోజు బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత సీమర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ తలవంచారు. 58.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటయ్యారు. ఆ తర్వాత కోహ్లీ సేనదే పైచేయి అయింది. ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 37 పరుగులతో బ్యాటింగ్ చేస్తూండగా, చటేశ్వర్ పుజారా 43 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రోహిత్ శర్మ 6 పరుగులు చేసి అబు జయాద్ బౌలింగ్ లో లిటన్ దాస్ కు క్యాచిచ్చి పెవిలియన్ చేరాఢు.
ఇక తొలి టెస్టులో రెండో రోజు ఆట మొదలైంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ పుజారా(54; 72 బంతుల్లో 9×4), మయాంక్ అగర్వాల్(52; 98 బంతుల్లో 9×4) అర్ధ శతకాలు బాదారు. తొలుత పుజారా అర్ధ శతకం సాధించి ఔటయ్యాక.. మయాంక్ అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. దీంతో 31 ఓవర్లకు టీమిండియా 114/2తో కొనసాగుతోంది. పుజారా వెనుదిరిగాక కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.