వన్ డే క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను ఎందరో ప్లేయర్స్ సాధించడం మరియు వాటిని అధిగమించడం జరిగాయి. కాగా తాజాగా మరో రికార్డును పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనలో భాగంగా అయిదు వన్ డే ల సిరీస్ ఆడుతోంది. ఇందులో పాకిస్తాన్ వరుసగా మ్యాచ్ లను గెలుస్తూ కమాండ్ చేస్తోంది. అయితే ఈ రోజు కరాచీ వేదికగా నాల్గువ వన్ డే లో బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ ఇన్నింగ్స్ సాగుతోంది. కాగా ఈ మ్యాచ్ లో బాబర్ ఆజం అరుదైన ఘనతను సాధించాడు. వన్ డే లలో అత్యంత వేగంగా 5000 పరుగులను పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు.
ఇతను కేవలం 97 ఇన్నింగ్స్ లలో పరుగులు సాధించడం విశేషం. ఇతని కెరీర్ లో ఇప్పటి వరకు 17 సెంచరీలు మరియు 26 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఇంతకు ముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు హషిమ్ అమలా పేరిట ఉండేది. ఇతను 101 ఇన్నింగ్స్ లలో 5000 పరుగులు చేశాడు.