ఈ అలవాట్లతో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది..!

-

స్పెర్మ్ కణాలు: మగవారు కూడా వారి యొక్క ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. మగవారు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవడం మంచి జీవన విధానాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. చాలామంది మగవారు పర్సనల్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీర్య కణాల సంఖ్య తగ్గుతూ ఉంటుంది అటువంటి మగవాళ్ళు ఈ అలవాట్లని అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగాలన్నా సంతనోత్పత్తి అడ్డంకులు ఏమీ రాకుండా ఉండాలన్నా వీర్య కణాల నాణ్యత సంఖ్య మెరుగ్గా ఉండాలన్నా ఆహారం, జీవనవిధానం చాలా ముఖ్యం. అయితే ఈ రోజుల్లో సరైన జీవన విధానాన్ని పురుషులు పాటించకపోవడం వలన వీర్య కణాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి.

స్పెర్మ్ కణాలు
స్పెర్మ్ కణాలు

వీర్య కణాల సంఖ్యను పెంచుకోవడానికి ఈ విధంగా చేయడం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే టెస్టోస్టెరీన్ లెవెల్స్ పెరుగుతాయని స్టడీ అంటోంది. కాబట్టి రోజు వ్యాయామం చేయడం మంచిది. పోషక పదార్థాలను తీసుకుంటే కూడా స్పెర్మ్ కౌంట్ మెరుగుపడుతుంది. విటమిన్ డి, సి వంటి విటమిన్ సప్లిమెంట్స్ ని తీసుకోండి అలానే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు కూరగాయల్ని కూడా డైట్లో తీసుకోండి. నారింజ, ద్రాక్ష, బొప్పాయి, నేరేడు వంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఆల్కహాల్ ని అసలు తీసుకోకూడదు ఆల్కహాల్ ని తీసుకునే వాళ్ళలో వీర్య కణాల నాణ్యత దెబ్బతింటుంది సంతాన ఉత్పత్తి సమస్యలు కలుగుతాయి.

బరువు పెరగడం నిద్రలోపించడం ఒత్తిడి వీటి వల్ల కూడా వీర్య కణాల సమస్య వస్తుంది. యాంటీబయటిక్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బరువు ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. బాగా బరువు ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్య కలుగుతూ ఉంటుంది. స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. మంచి ఆహారాన్ని తీసుకోవడం సరైన జీవన విధానాన్ని అనుసరించడంతో ఈ సమస్యలేమీ లేకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news