నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ అధికారుల కృషిని అభినందించిన మంత్రి మేకపాటి కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో ఎపిఎస్‌ఎస్‌డిసితో మూడు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. నిర్మాణ రంగంలో దాల్మియా భారత్ ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తో మరో మెట్టు ఎక్కాం అని మంత్రి అన్నారు. దాల్మియా భారత్ ఫౌండేషన్, ఎన్ఎస్ఈ అకాడమీ లిమిటెడ్, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల ఎంవోయూ కీలక అడుగు వేశామని అన్నారు.
హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంవోయూలో పాల్గొన్న మంత్రి మేకపాటి… మారుతున్న ప్రపంచాన్ని బట్టి నైపుణ్యం మారుతుంది అన్నారు. ఎక్కువ జనాభా ఉన్న మనదేశం మరింత నైపుణ్యం ఉన్న యువతను తీర్చిదిద్దాలి అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏ సవాళ్లనైనా స్వీకరించే నైపుణ్యం సాధించాలని ఆయన అన్నారు. పరిశ్రమల స్థాపన కన్నా ముందు 21వ శతాబ్దానికి తగ్గ నైపుణ్యం సాధించడంపై శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు. 2050-2060 కల్లా ఎదురులేని నైపుణ్యశక్తిగా యువత ఎదగాలని, సంక్షోభాలు వచ్చినా అవకాశాలు వెతుక్కోవాలి అంటూ చంద్రబాబు డైలాగ్ చెప్పారు.