విజయవాడ నగర వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా వేసారు. ఈ నెల 18(శుక్రవారం)న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారని ముందు ప్రకటన చేసారు. కానీ, నిన్న నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీ కేశినేని పేర్కొన్నారు.
అయితే, ప్రజల అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలను రేపటి నుంచి అనుమతిస్తున్నట్లు ఆయన ట్విటర్ లో ప్రకటించారు. కాని మళ్ళీ ప్రయాణాలను వాయిదా వేసారు. కలెక్టర్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటన చేసారు. దీనితో బెజవాడ వాసులు షాక్ అయ్యారు. తొలుత ఈ ఫ్లైఓవర్‌ను ఈనెల 4నే ప్రారంభించాలని భావించారు. ప్రణబ్ ముఖర్జీ మృతితో వాయిదా వేసారు.