బడ్జెట్ 2022 : కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకునే వాళ్లకి బ్యాడ్ న్యూస్..!!

-

చాలా మంది బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆసక్తితో బడ్జెట్ కి సంబందించిన అప్డేట్స్ ని చూస్తున్నారు అంతా. 130 కోట్ల మంది ప్రజలు ఎదురు చూసే బడ్జెట్ కొన్ని గంటల్లో మన ముందుకి వచ్చేస్తోంది కూడా. అయితే మరి స్మార్ట్ ఫోన్ కి సంబంధించి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేద్దాం.

స్మార్ట్‌ఫోన్ వంటి 50 రకాల ప్రొడక్టుల ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. కనుక స్మార్ట్ ఫోన్ తీసుకోవాలని అనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆర్థిక వ్యవస్థలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉండగా 2022 బడ్జెట్‌లో దేశీయ పరిశ్రమకు ఊరట నిచ్చేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 50 ఉత్పత్తులపై ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచేలా కనపడుతోంది.

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, కెమికల్, హ్యాండి క్రాఫ్ట్స్, స్మార్ట్‌ఫోన్లు వంటి వస్తువులపై ప్రభుత్వం సుంకాలు పెంచేలా కనపడుతోంది. అయితే ఇదే కనుక జరిగితే డైరెక్ట్ గా ఈ ప్రభావం మన పై పడుతుంది. ఇందులో సందేహం ఏమి లేదు. చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే 56 బిలియన్ డాలర్ల ప్రొడక్టులపై ఈ సుంకం పెంపు వుండనుందని తెలుస్తోంది. ఈ సుంకం పెంపు 5 శాతం నుంచి 10 శాతం దాకా వుండచ్చని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news