పిల్లలు పరీక్షలలో ఫెయిల్ అయితే తల్లిదండ్రులు తిట్టడం, కొట్టడం చేస్తూ ఉంటారు. ఇక మరి కొంతమంది పిల్లలు పరీక్షలలో మార్కులు తక్కువ వస్తే ఏడుస్తూ ఉంటారు. నేటి కాలంలో చాలామంది పిల్లలు సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని నవనగరలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. పిల్లలకు ఒకటి రెండు మార్కులు తక్కువగా వస్తేనే చాలామంది తల్లిదండ్రులు తిట్టడం, కొట్టడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోమారడం ఇలా అనేక రకాలుగా చేస్తున్నారు.

కానీ అభిషేక్ తల్లిదండ్రులు చేసిన పని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. 10వ తరగతి ఫలితాల్లో అతడు ఆరు సబ్జెక్టులకు గాను ఆరు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. 600 మార్కులకు గాను 200 మార్కులే రావడం విశేషం. అభిషేక్ స్నేహితులు ఫెయిల్ అయ్యావని హేళన చేయడంతో తల్లిదండ్రులు ఓ కేక్ తెప్పించి కొడుకుతో కట్ చేయించి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఫెయిల్ అయినంత మాత్రాన ఏమీ కాదని, పరీక్షలు వచ్చే సంవత్సరం కూడా రాయవచ్చని అభిషేక్ తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. దీంతో అభిషేక్ చాలా సంతోషంలో ఉన్నాడు.