బ్రేకింగ్ : టిడిపి నేత పట్టాభి కి బెయిల్ మంజూరు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రతినిధి… పట్టాభి రామ్ కు బెయిల్ మంజూరైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు కేసులో అరెస్ట్ అయిన పట్టాభి రామ్ కి బెయిల్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హై కోర్టు.

pattabhi

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న పట్టాభి కి..   బెయిల్ మంజూరు కావడం తో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. కాగా అక్టోబర్ 20 వ తేదీ న పట్టాభి రామ్ అరెస్ట్ అయ్యారు. పట్టాభి ఇంటి  తలుపులు పగల కొట్టి మరీ  అరెస్టు చేశారు పోలీసులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యం లో పట్టాభి రామ్ ను  అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఇక అటు టిడిపి కార్యాలయాలపై వైసీపీ చేసిన దాడికి నిరసనగా.. చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టారు.