కరీంనగర్ జిల్లా : హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ మరియు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇవాళ… మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో ఈటల రాజేందర్ టచ్ లో ఉన్నారని… వారిద్దరూ రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపణలు చేశారు.
హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక తర్వాత ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు కేటీఆర్. అయితే చేసిన ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. తాను టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేశాక అన్ని పార్టీల నాయకులను కలిశానని పేర్కొన్న ఈటల… అందులో బాగంగానే రేవంత్ రెడ్డి ని కలిశానని.. అందులో తప్పేముందన్నారు. అయితే బిజెపి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కలిసే అవకాశం లేదని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు ఈటల. తనకు కుసంస్కారం లేదని.. రేవంత్ రెడ్డి తో తనకేం సంభందమన్నారు. భవిష్యత్ లో బిజెపి లో ఉన్నా.. కాంగ్రెస్, సీపీఐ పార్టీల నాయకులతో కూడా కలిసి మాట్లాడతానని.. తెలంగాణ రాష్ట్రం లో అవి నిషేధించబద్ద పార్టీలు కావన్నారు.