ఏపీలో నాకు క్రేజ్ ఉంది..దానికి కారణం జగనే : బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

కడప జిల్లా : కొత్తగా ఎంపిక అయిన SAP చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి .. ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ కు ఎల్లప్పుడూ తాను ఋణపడి ఉంటానని స్పష్టం చేశారు… బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక క్రేజ్ ఉందంటే అది సీఎం జగన్ ఇచ్చిన గౌరవమేనన్నారు… శాప్ చైర్మన్ పదవి కంటే గతంలోనే ఇంత కంటే పెద్ద పదవైన నియోజకవర్గ ఇంచార్జ్ ఇచ్చారని గుర్తు చేశారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.

సీఎం జగన్ మాట ఇచ్చారంటే తప్పడని.. అది ప్రజలకు కూడా తెలుసు అని పేర్కొన్నారు..
తన పదవిని వ్యతిరేకించే వాళ్ళ గురించి నేను మాట్లాడబోనని చురకలు అంటించారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా ఉంటున్నానని చెప్పిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. కొంత మంది కావాలనే విభేదాలు సృష్టిస్తూ ఉన్నారని మండిపడ్డారు. పదవి రావడం తనకు మరింత భాద్యత పెంచిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారుల ప్రతిభను గుర్తించి క్రీడా అభివృద్ధికి పాటు పడతానని హామీ ఇచ్చారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.