త్యాగనిరతికి ప్రతీక బక్రీద్ : కేసీఆర్

-

త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముస్లిం శుభాకాంక్షలు తెలిపారు. దైవాజ్ఞను అనుసరించి సమాజ హితంకోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందని కేసీఆర్ అన్నారు.తమకు కలిగిన దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమనే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలని అన్నారు.

కాగా, రంజాన్ తర్వాత ముస్లింలు జరుపుకునే అతి పెద్ద పండుగ బక్రీద్. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే మూగజీవి.. ఈద్ అంటే పండుగ అని అర్థం.ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకొంటారు.ఇస్లామీయ కేలండర్ ప్రకారం 12వ నెల యైన జుల్ హజ్జా 10వ తేదీన ఈ పండుగ జరుపుకొంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ తీర్థయాత్రగూడా చేస్తారు. ఈ యాత్రకొరకు సౌదీ అరేబియా లోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్-అల్-హరామ్ లోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news