‘నీట్‌’పేపర్‌ లీక్‌’ … స్పందించిన కేంద్ర మంత్రి

-

దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. నీట్ పేపర్‌ లీక్‌పై వస్తోన్న ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో నీట్‌’పేపర్‌ లీక్‌ వ్యవహారం పై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఒకవేళ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అధికారులది తప్పని తేలితే వదిలేది లేదని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ స్పష్టం చేశారు.ఆదివారం(జూన్‌16) ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పేపర్‌లీక్‌కు సంబంధించి 2 చోట్ల అక్రమాలు వెలుగుచూశాయి. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని పేరెంట్స్‌, తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నా. ఇందులో ఎంత పెద్దస్థాయి అధికారులున్నప్పటికీ వదిలేది లేదు అని అన్నారు.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. బిహార్‌ ఆర్థిక నేరాల విభాగం 9 మంది నీట్‌ అభ్యర్థులకు పేపర్‌లీక్‌ కేసులో నోటీసులిచ్చింది. వారిని విచారణకోసం పిలిచాం’అని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news