నా భర్తను వెన్నుపోటు పొడిచారు అంటున్న బాలాదిత్య భార్య..!!

-

హీరోగా తనకంటూ గుర్తింపును సొంతం చేసుకునే ప్రయత్నం చేసిన బాలాదిత్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఇతను బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారు.. బిగ్ బాస్ లో అనుకున్నవన్నీ తారుమారు అవ్వడంతో అందరి ఆటల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే బయట నుంచి కంటెస్టెంట్స్ కు సంబంధించిన వారు కూడా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలాదిత్య భార్య కూడా స్పందిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా , సింగర్ గా పరిచయమైన బాలాదిత్య అందరికీ సుపరిచితుడు. ఇక ఆ తర్వాత సినిమాలలో కాస్త డల్ అయ్యాడు. ఇక హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈయన సినిమాలు సరిగా రాకపోవడంతో.. ప్రస్తుతం సినిమాలలో ఎక్కడా కనిపించడం లేదు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అవకాశం రావడంతో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఇకపోతే తెలుగు తెరపై చాలాకాలం వందల సినిమాలలో అలరించిన బాలాదిత్య సెకండ్ ఇన్నింగ్స్ కోసం బిగ్ బాస్ ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన మార్క్ గేమ్ తో సందడి చేసే ప్రయత్నం చేస్తున్నారు బాలాదిత్య. అంతేకాదు సౌమ్యుడు , మంచివాడు అనే బిరుదును కూడా పొందుతున్నాడు. ఇకపోతే హౌస్ లో చాలా సౌమ్యంగా ఉంటూ తన ఆటను ఎవరికి అర్థం కాకుండా ఆడుతూ ఎంతోమంది నుంచి ప్రశంసలు కూడా దక్కించుకుంటున్నాడు. మరొకవైపు ట్రోల్స్ కూడా తప్పడం లేదు అని తెలుస్తోంది.

ఇకపోతే ఈ సందర్భంగా బాలాదిత్య భార్య మాట్లాడుతూ.. బాలాదిత్య రియల్ గా ఎలా కనిపిస్తాడో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉన్నాడు. ఆయన మొదటి నుండి చాలా సౌమ్యంగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే బిగ్ బాస్ లో ఉంటున్నారు అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో కొందరు తన భర్తకు వెన్నుపోటు పొడుస్తున్నారు అని , అలానే ఆడుతున్నారని ఆయన మంచితనాన్ని వాడుకున్నారు అంటూ బాధపడింది. ఇకపోతే చాలా టాస్కుల్లో నమ్మిన వారే మోసం చేయడం కాస్త బాధ కలిగించిందంటూ బాలాదిత్య భార్య వెల్లడించింది. అంతేకాదు తన భర్త టాప్ ఫైవ్ లో కచ్చితంగా ఉంటాడని ధీమా వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news