చంద్రబాబు సభలో కార్యకర్తలు మృతి చెందడం మనసును తీవ్రంగా కలచివేసిందన్నారు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడే మోయాల్సి రావడం అత్యంత బాధాకరం అన్నారు. 8 మంది మరణవార్త 80 లక్షల కార్యకర్తల కుటుంబాల్లో విషాదం నింపిందన్నారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బాలకృష్ణ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అలాగే టిడిపి పొలిటి బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. పార్టీకి మూల స్తంభాలైన కార్యకర్తల్ని కోల్పోవటం విషాదకరం అన్నారు. టీడీపీ సభలకు వైసీపీ ప్రభుత్వం సహకరించంటం లేదని ఆరోపించారు. జగన్ సభలకు వేలాది మందితో పహారా కాస్తున్న పోలీసులు చంద్రబాబు సభలకు నామమాత్రంగా భద్రత కల్పిస్తున్నారని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు యనమల.