హాస్పిటల్‌లో బాలయ్య.. మోకాలికి ఆపరేషన్.. ఆందోళనలో అభిమానులు..

-

అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలక్రిష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్య నటిస్తున్నారు. తాజాగా ఆయన భుజానికి ఆపరేషన్ జరిగింది. అఖండ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయనకు చిన్న ప్రమాదం జరిగింది. దీంతో హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో ఆయన భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. తాజాగా బాలయ్య కు మరో శస్త్రచికిత్స నిర్వహించారు డాక్టర్లు.
కొంతకాలంగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన మొక్కలకి డాక్టర్లు మైనర్ సర్జరీ నిర్వహించారు. బాలయ్యకు జరిగింది చిన్న ఆపరేషన్ అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. మరోవైపు ఆసుపత్రిలో డాక్టర్లతో పాటు బాలయ్య దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన బాలయ్య ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news