ఐదేళ్ల కూతురుపై తండ్రి అత్యాచారం… బ్లూ ఫిల్మ్స్ చూస్తూ దారుణం

-

కామాంధులు వావీ వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు దుర్మార్గులు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు, చట్టాలు తీసుకువచ్చిన కామాంధుల బరితెగింపుకు అడ్డుకట్ట పడటం లేదు. ఇదిలా ఉంటే కన్న కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాటేస్తున్నాడు. తన కామదాహంతో సొంత కూతుళ్ల పైనే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణం ఏపీలో చోటుచేసుకుంది. 

ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో తండ్రి రూపంలో నరరూపరాక్షసుడు కూతురుపైనే అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అభం శుభం తెలియని 5 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కంటికిరెప్పలా కాపాడాల్సిన తండ్రి 5 ఏళ్ల చిన్నారిని చిదిమేశాడు. సెల్ ఫోన్ లో బ్లూ ఫిల్మ్స్ చూస్తూ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. చిన్నారి తండ్రి దగ్గర పడుకోపెట్టవద్దని తల్లితో చెప్పడంతో అనుమానం వచ్చిన తల్లి నిఘా పెట్టడంతో ఆ నీచుడు దొరికాడు. దీంతో భర్తను పట్టుకుని, పోలీసులకు అప్పగించింది.

Read more RELATED
Recommended to you

Latest news