బాలయ్యా మజాకా.. ఆమాత్రం ఉండాల్సిందే..!

-

టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పుడు వరుస హిట్ మూవీలు తెరకెక్కిస్తూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, వెంకటేష్ , వరుణ్ తేజ్ తో f3 వంటి సినిమాలు తీసి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా షూటింగు జరుగుతుంది. ఇందులో శ్రీ లీల , కాజల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇకపోతే ఎన్.బి.కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా 90 లలో ఉన్న బాలయ్యను మరొకసారి ఈ పోస్టర్ గుర్తు చేసిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే బాలయ్య పాత్రను ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట అనిల్ రావిపూడి. ఈ సినిమా నుంచి తాజాగా బయటకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులలో అంచనాలను పెంచేస్తున్నాయి.. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ చాలా వైల్డ్ గా ఉంటుందని.. బాలకృష్ణ ఇందులో కాళీమాత భక్తుడిగా కనిపించనున్నారని సమాచారం.

మూవీలో పలు యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయట. ఇందుకోసం చాలామంది టెక్నీషియన్స్ ని కూడా తీసుకురానున్నారని సమాచారం. ప్రస్తుతం ఒక సాంగ్ షూటింగ్ జరిగిందట . దీనికోసం ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ పాటలో బాలకృష్ణతో పాటు శ్రీ లీలా కూడా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాకు ఈ పాట స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది ..ఇకపోతే ఒక్క పాట కి రూ. 5 కోట్లు అంటే బాలయ్య కాబట్టి ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news