జై బాల‌య్య : న్యూ మూవీ అప్డేట్ ఇదే!

-

యా యా యా జై బాల‌య్య అని పాడుకుంటూ అభిమానులు వెర్రెత్తి పోతున్నారు.అంత‌గా థియేట‌ర్ల‌లో పూన‌కాలు తెప్పించింది బాల‌య్య సినిమా! బాల‌య్య ఇక చాలయ్యా అని అనుకునేందుకు వీల్లేదు..అంత‌గా ఆయ‌న త‌న ఈజ్ తో సినిమాను మొత్తం భుజాల‌పై వేసుకుని త‌న‌దైన శైలిలో న‌డిపిన విధాన‌మే అఖండ చిత్రం ఘన విజ‌యానికి కార‌ణం.ఈ సినిమా మూడు చోట్ల ఘ‌న విజ‌యం అందుకుంది. ఒక‌టి థియేట‌ర్ల‌లో అదే స‌మ‌యంలో ఓవ‌ర్సీస్ లో ఆ విధంగా రెండో స‌క్సెస్ ఇక మూడో స‌క్సెస్ ఓటీటీలో!
ఆ విధంగా బాల‌య్య హ్యాట్రిక్ విజ‌యాలు అందుకున్నారు.

క‌లెక్ష‌న్ల ప‌రంగా ఎప్పుడో యాభై కోట్ల మార్క్ దాటేసింది. ఓవ‌ర్సీస్ లో ఒన్ మిలియ‌న్ డాల‌ర్ క‌లెక్ష‌న్ మార్క్ ను సునాయాసంగా ఎప్పుడో దాటేసింది. ఇవికాకుండా డిస్నీ హాట్ స్టార్ (ఓటీటీ ప్లాట్ ఫాం) లో ఒక్క రోజులోనే ఒన్ మిలియ‌న్ వ్యూస్ ద‌క్కించుకుంది. ఆ విధంగా బాల‌య్య ఒక్క‌టి కాదు రెండు ఏకంగా మూడు భారీ విజ‌యాలు న‌మోదు చేసి చ‌రిత్ర సృష్టించారు కాదు కాదు ఆయ‌న అన్న విధంగానే చ‌రిత్ర‌ను తిర‌గ రాశారు. పునఃలిఖించారు.

అఖండ విజ‌యం ఓ వైపు అయితే మ‌రోవైపు ఓటీటీ (ఆహా)లో బాల‌య్య అన్ స్టాప‌బుల్ షో ఘ‌న విజ‌యం అందుకుని నిర్మాత అల్లు అర‌వింద్ కు లెక్క‌లేనంత పేరు, కీర్తి,ఆదాయం తెచ్చి పెట్టాయి. మొత్తం ప‌ది ఎపిసోడ్ల‌తో బాల‌య్య ఘ‌న విజ‌యం అందుకుని షోకు సంబంధించి ఫ‌స్ట్ సీజ‌న్ ను కంప్లీట్ చేశారు. ఈ షో ఇచ్చిన స్ఫూర్తితో త్వ‌ర‌లో చిరుతో సెకండ్ సీజ‌న్ స్టార్ట్ కానుంది.

నా పేరు మీకు తెలుసు నా స్థానం మీ మ‌న‌సు అని బాల‌య్య చెప్పిన డైలాగ్ ఎంత‌గానో అల‌రించింది అభిమానుల‌ను మ‌రియు సినిమా ప్రేమికుల‌ను కూడా! ఇవే కాదు బాల‌య్య చైర్మ‌న్ గా ఉంటూ న‌డిపే ఆల‌యం బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి కూడా సేవ‌ల్లో జాతీయ స్థాయిలోనే అగ్ర‌గామిగా ఉంది.ఇవ‌న్నీ ఇచ్చిన స్ఫూర్తితో అఖండ విజ‌యాల స్ఫూర్తితో ఆయ‌న కొత్త సినిమాను ప‌ట్టాలెక్కించనున్నారు.గోపీచంద్ మ‌లినేని సినిమాకు శ్రీ‌కారం దిద్ద‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 12 నుంచి షూట్ ప్రారంభం కానుంది. యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తోనే ఈ సినిమా ఆరంభం కానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా, అందాల తార శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది.ఎస్ ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news