మత్తులో ముంచేస్తున్న బొంగులో కల్లు..ఎక్కడో తెలుసా?

-

కల్లు అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే అది కెమికల్ కాదు.సహజ సిద్ధంగా చెట్ల నుంచి వచ్చే ద్రావణం.ఎన్నో రొగాలను కూడా నయం చేస్తుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అందుకే వేసవిలో కల్లుకు భారీ డిమాండ్ ఉంటుంది..కొన్ని రకాల కల్లు కావాలంటే ముందు ఆర్డర్ కూడా చేసుకోవాలట.పొలిటికల్ రిఫరెన్సులతో వచ్చి బుక్కెడు కావాలన్నా గరిటంత కూడా దొరకదు..చుక్క కూడా మిగిలకుండా పోయె వరకూ క్యూ ఉంటుందట. అందులో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా..అవును అండీ.. అది బొంగులోని కల్లే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉంది. అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో బొంగులో కల్లు కోసం జనాలు బారులు తీరుతున్నారు.. కార్యమేదైనానా కల్లుతోనే విందు చేసుకుంటారు. అందులో మన తెలంగాణ లో దావత్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేధి ఈ కల్లే.. ఈ బొంగులో కల్లు గురించి ఒకసారి చుద్దాము..ఒక్కో తాటి చెట్టుకు మట్టి కుండలకు బదులు.. పదుల సంఖ్యలో వెదురు బొంగులు పెట్టారు. అప్పుడు చెట్టు నుంచి వచ్చే కల్లు నేరుగా వెళ్లి బొంగుల్లోకి చేరుతుంది.. అనంతరం కిందకు దించుతారు. అయితే ఇలా వెదురు బొంగులో నుంచి తయారు చేసిన కల్లు,మట్టి కుండల కల్లు కంటే రుచిగా ఉంటుందని చెబుతున్నారు. .ఆ విధంగా ఆ కల్లు ఇప్పుడు రాష్ట్రమంతా ఫెమస్ అయ్యింది. ఎప్పుడైనా భద్రాద్రి కి వెళితే మీరు కూడా ట్రై చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Latest news