తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. గడ్డి మందులపై నిషేధం !

-

తెలంగాణ రైతులకు బిగ్ షాక్ తగిలింది. గడ్డి మందులపై కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్లైఫోసెట్ మందుపై నిషేధం విధించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అన్ని రకాల కలుపు మొక్కల నివారణ కోసం ఉపయోగించే గ్లైఫోసిట్ 41% ఎస్ఎల్ నాసిరకమని పరీక్షల్లో గుర్తించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది.

మహారాష్ట్ర బయోఫెర్టిలైజర్స్ లిమిటెడ్ తయారుచేసి విక్రయిస్తున్న ఈ మందును నిషేధిస్తున్నామని, రైతులెవరు దీనిని కొనవద్దని, వ్యాపారులు అమ్మవద్దని హెచ్చరించింది. ఇకముందు వీటిని వాడితే, లేక అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. కాగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరియు ఇతర ప్రాంతాల్లో కూలీల సమస్య అధికంగా ఉంది.  ఈ నేపథ్యంలోనే చాలామంది రైతులు గడ్డి మందులు వాడుతున్నారు. కూలీల ఖర్చు కంటే గడ్డి మందు తక్కువ అవుతుందనే తరుణంలో…. రైతులు గడ్డి మందులు కొట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో… రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news