అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ఇస్తున్న టిల్లు గాళ్ ఫ్రెండ్..!

-

నేహా శెట్టి.. మెహబూబా సినిమాలో తెలుగులో చాన్స్ అందుకొని సందీప్ కిషన్ హీరోగా వచ్చిన గల్లీ రౌడీ సినిమాలో హీరోయిన్గా చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో చిన్న పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది. ఇటీవల సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమాలో నటించిన నేహా శెట్టి ఈ సినిమాలో రాధికా పాత్రలో రెచ్చిపోయింది. రాధిక పాత్రకు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారు. ఇక ఈమె సినిమాలు మాత్రమే కాదు వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ తో కలిసి జొమాటో యాడ్ కూడా చేసింది నేహా శెట్టి.

డీజె టిల్లు క్రేజ్ తో నేహా శెట్టి కి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ సరసన అవకాశం దక్కించుకుంది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో గ్లామర్ అటాక్ తో ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ క్రమంలోనే దీపావళి పండుగ సందర్భంగా గ్లామర్ లుక్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. దీపావళి పార్టీలో పాల్గొన్న ఈమె.. స్లీవ్ లెస్ జాకెట్.. గాగ్రా అందాలతో అదరగొట్టింది. ఈమె గ్లామర్ హాట్ షో చూసి కుర్రకారు సైతం పిచ్చెక్కిపోతున్నారు. అంతేకాదు గ్లామర్ షోలో నో లిమిట్స్ అనిపించేలా తన క్రేజీ లుక్స్ తో కుర్రకారును ఇంప్రెస్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

యంగ్ హీరోయిన్స్ లో ఎలాంటి పాత్రలకైనా సరే ఓకే చెబుతున్న వారిలో నేహా శెట్టి కూడా ఒకరు. ఉదాహరణ డీజె టిల్లు అని చెప్పాలి. ఈ సినిమాలో రాధిక పాత్రకు చాలా గట్స్ ఉండాలి. కానీ చాలా సునాయాసంగా నేహా శెట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. వచ్చిన ఐడెంటిటీ ని ఉపయోగించుకొని హాట్ ఫోటోషూట్స్ తో ఇప్పుడు మరింతగా రెచ్చిపోతుంది.ఇక ఈ ముద్దుగుమ్మకు ఏ స్థాయిలో అవకాశాలు వస్తాయో తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Neha Sshetty (@iamnehashetty)

Read more RELATED
Recommended to you

Latest news