బనానా చిప్స్‌ బాగున్నాయి కదా అని లాగించేస్తున్నారా..?

-

అరటిపండు అంటే నచ్చని వాళ్లకు కూడా అరటిపండు చిప్స్‌ నచ్చుతాయి. అంత టేస్టీగా ఉంటాయ్‌ కదా అవి.. తినే కొద్ది తినాలనిపిస్తుంది. అసలు ఈ చిప్స్‌ ముందు కుర్‌కురేలు, లేస్‌లు ఇవన్నీ పనికిరావని ఈ చిప్స్‌ ప్రేమికులు అంటుంటారు. సాయంత్రం వేళ మంచి స్నాక్‌ ఐటమ్‌గా అరటిపండు చిప్స్‌ తిని టీ తాగితే చాలు కడపునిండిపోతుంది. చక్కెర సిరప్, సుగంధ ద్రవ్యాలు, ఉప్పును ఈ చిప్స్‌ తయారీలో ఉపయోగిస్తారు. అయితే.. అరటి పండు చిప్స్ తినటం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

అరటి చిప్స్ ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు..ముఖ్యమైన కేలరీలు, చక్కెర, కొవ్వును అందించే తేనె లేదా సిరప్ వంటి పదార్థాలను వీటికి జోడించి..డీప్‌గా నూనెలో వేయించి ప్యాక్ చేస్తారు. ప్రతి అరకప్పు చిప్స్‌లో 210 కేలరీలతో పాటు 12.5 గ్రాముల కొవ్వును కలిగి ఉంటాయి. ఈ చిరుతిండిలో ఫైబర్, కొన్ని విటమిన్లు, ఖనిజాలు ఉన్నప్పటికీ, కొవ్వు, కేలరీలు, చక్కెర కంటెంట్ బరువు పెరిగేలా చేస్తుంది.ఆ తర్వాత మీ ఇష్టం మరీ.. బరువు తగ్గాలని అన్నం మానేసి అరటి చిప్స్‌ తింటే అంతే సంగతులు..

అరటి పండు చిప్స్‌ను నూనెలో వేయించటం వల్ల కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. చర్మ సంబంధిత ఎలర్జీలు వున్నవారు వీటికి దూరంగా ఉండటం ఉత్తమం.ఆస్తమా సమస్య ఉన్నవారు బనానా చిప్స్ తీసుకునే విషయంలో వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ చిప్స్ సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది.. ఓ కప్పు బనానా చిప్స్‌లో దాదాపు 12 గ్రాముల చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి.. అదే పనిగా తినొద్దు. ఎప్పుడన్నా ఒకసారి అయితే ఎలాంటి సమస్యా ఉండదు.. అతిగా తింటేనే రోగాలు కూడా అతిగా వస్తాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే మీకు ఈ చిప్స్‌ తినే అలవాటు ఉంటే చూసుకోండి మరీ..!

Read more RELATED
Recommended to you

Latest news