పాకిస్థాన్ ఉగ్ర వాదులతో కేసీఆర్ కు సంబంధాలు : బండి సంజయ్ సంచలనం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ సారి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ గురించి కేసీఆర్‌ మాట్లాడుతాడని… కొంపతీసి.. ఉగ్రవాదులతో కేసీఆర్‌ కు సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి కేసీఆర్‌ బిజినెస్‌ చేస్తున్నాడని డౌట్‌ వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ పై దర్యాప్తు చేయాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం మర్యాదగా మాట్లాడితే…సీఎం కేసీఆర్ కు మైండ్ దొబ్బిందని నిప్పులు చెరిగారు. నాలుకకు, మెదడుకున్న నరం కట్ అయ్యిందని….కేసీఆర్‌ భాషను చూసి జనం నవ్వుకుంటున్నారని నిప్పులు చెరిగారు.

కేసీఆర్ సెన్సార్ భాష వాడుతున్నారని… రండ, పిచ్చి గాడిదకొడుకులు, బేవకూఫ్, నా కొడకా…అంటూ మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు. కేసీఆర్‌ నోటిని ఫినాయిల్ పోసి… ఇనుప బ్రష్ పెట్టి గీకినా బాగుపడదని ఫైర్‌ అయ్యారు. మేం మాట్లాడితే… నీ తలకాయ యాడ పెట్టుకుంటావ్? అని ప్రశ్నించారు. కేసీఆర్ జాగ్రత్త…ఏది పడితే అది మాట్లాడితే జనం సహించరని హెచ్చరించారు బండి సంజయ్‌.