బూతుల యూనివర్సీటికీ వైస్ ఛాన్సలర్ కేసీఆర్ – బండి సంజయ్

-

సీఎం కేసీఆర్ పత్రికా సమావేశం బడ్జెట్ పై పెట్టి అభ్యంతరం చెప్పొచ్చు… ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్ ను ఇష్టం వచ్చిన రీతిలో తిట్టారని… బూతుల యూనివర్సిటీకి కేసీఆర్ వైస్ ఛాన్స్ లర్ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నిన్ను తిట్టేవారు లేకనా.. నీకంటే ఎక్కువ బూతుల వస్తామని.. అయితే సంస్కారం అడ్డం వస్తుందని.. మాపార్టీ అలాంటిది అని బండి సంజయ్ అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టడం లేదని.. నువ్వే ముఖ్యమంత్రి కదా.. అంతపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టానని చెప్పుకుంటావు కదా.. అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. అంబేద్కర్ జయంతి, వర్థంతి దినోత్సవాలకు ఎందుకు రావు.. నీకు అంత బలుపా.. అహంకారమా అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శించారు. ఇది అంబేద్కర్ ను అవమానపరచడమే అన్నారు.

దేశంలో ప్రతీ ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతి, వర్థంతి దినోత్సవాలను అధికారికంగా నిర్వహించి మంచి మాట్లాడుతారు అని… నువ్వు మాట్లాడితేే బూతులే వస్తాయని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పారని అన్నారు. దేశంలో అతిపెద్ద అవినీతిపరుడిని నువ్వే అని… కేంద్రమంత్రిగా ఉన్నప్పడు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు బండి సంజయ్. రాజ్యాంగం జోలికి రావద్దని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లు నెత్తికెక్కి అహంకారంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news