కాంగ్రెస్ పార్టీని తిడితే మీకేం నొప్పి.. టీఆర్ఎస్ పై బండి సంజయ్ ఫైర్

-

ప్రధాన మంత్రి మోదీ కాంగ్రెస్ పార్టీని తిడితే మీకేం నొప్పి పుడతుందని.. టీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలోని సమస్యలపై ప్రజల చూపు మరలించడానికి టీఆర్ఎస్ పార్టీ డ్రామాలు అడుతుందని విమర్శించారు. మోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని… మీకెక్కడ నొప్పి పుడుతుందో అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. ఆరే దీపానికి వెలుగు ఎక్కువ అని టీఆర్ఎస్ పార్టీకి డౌన్ ఫాల్ ప్రారంభం అయిందని అయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేఖించలేదు కదా అని బండి సంజయ్ అన్నారు.

మళ్లీ ముఖ్యమంత్రి గంట మాట్లాడుతాడని… తెలంగాణ ప్రజలకు టైం పాస్ అవుతుందని, ముఖ్యమంత్రి ఓ జోకర్ అయిపోయిండని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసిన అనర్థాలను, ఇబ్బందులను మోదీ వివరించే ప్రయత్నం చేశారు. కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలపై బీజేపీ తీర్మాణం చేసిందని.. అయితే ఆ సమయంలో ఎన్డీయే కన్వీనర్ గా చంద్రబాబు ఉండటంతో ఇవ్వలేకపోయాం అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పడు ఎక్కడ పెప్పర్ స్ప్రే ఎక్కడ కొట్టలేదని అన్నారు. సుష్మా స్వరాజ్ పార్లమెంట్ లోనే ఉండి బిల్లు పాసయ్యేలా చేశారని.. కాంగ్రెస్ పార్ట చర్చ జరగకుండా మోసం చేసింది ఆయన విమర్శించారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఎక్కడికి పారిపోయావని కేసీఆర్ ని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులను క్యాబినెట్లో పెట్టుకున్నావని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news