ఉద్యోగ నోటిఫికేషన్ల వెనుక పెద్ద కుట్ర – బండి సంజయ్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పై కీలక ఆరోపణలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. యువతను బిజెపికి దూరం చేసేందుకే నోటిఫికేషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో యువత అంతా బిజెపి వైపు ఉన్నారని.. త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో వాళ్లు ఖాళీగా ఉంటే బిజెపికి సపోర్ట్ చేస్తారనే భయంతోనే కేసీఆర్ వరుస నోటిఫికేషన్లు ఇచ్చి కోచింగ్ సెంటర్లకు పంపుతున్నారని అన్నారు. ఇది పెద్ద కుట్రగా అభివర్ణించారు బండి సంజయ్.

కెసిఆర్ 100 ఎలుకలు తిన్న పెళ్లి లెక్క నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఇప్పటిదాకా ఆంధ్ర వాళ్ళని తిట్టిన కేసీఆర్.. ఆంధ్ర బిర్యానీని పెండ బిర్యాని అన్నారని విమర్శించారు. ఆంధ్ర బిర్యాని, ఉలవచారుని తీసుకువెళ్లి కేసీఆర్ కి తినిపించాలని ఆంధ్ర నేతలకు సూచించారు. అసలు టిఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడే లేడన్నారు బండి సంజయ్. సొంత రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించలేదు కానీ పక్క రాష్ట్రానికి ప్రకటించాడని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news