తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ ఉపఎన్నిక ఎంత ఆసక్తికరంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుండి హుజురాబాద్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి మొత్తం హుజురాబాద్ ఉపఎన్నిక మీదే ఉంది. ఐతే హుజురాబాద్ ఉపఎన్నిక ఎప్పుడనే విషయంలో మాత్రం ఎన్నికల సంఘం నుండి స్పష్టత రాలేదు. ఉపఎన్నికలు ఆలస్యం అవడానికి కారణం టీఆర్ఎస్ అని, తెలంగాన రాష్ట్ర సమితికి ఓటమి భయం పట్టుకోవడం వల్లే ఉపఎన్నికలను ఆలస్యం చేస్తున్నారంటూ బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి వ్యాఖ్యానించారు.
ఉపఎన్నికలు వాయిదా పడాలని టీఆర్ఎస్ చూస్తుందని, అందువల్ల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయంక్ కు లేఖ రాసారు. ఎలాంటి ఆలస్యం లేకుండా ఉపఎన్నికలను వెంటనే నిర్వహించాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.