నేటి నుండి బండి సంజ‌య్ పాద‌యాత్ర‌..!

-

నేటి నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ సంధ‌ర్బంగా ప్ర‌జా సంగ్రామ పాద యాత్ర వివ‌రాల‌ను పాద‌యాత్ర ఇంచార్జ్ జి.మ‌నోహ‌ర్ రెడ్డి వివ‌రించారు.
పాదయాత్ర కోసం 30 కమిటీ లు, 180 మంది కార్యకర్తలు పని చేస్తున్నారని చెప్పారు. పాద‌యాత్ర‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. 35 రోజుల పాటు ఈ పాద యాత్ర కొన‌సాగ‌నుంది. హుజూరాబాద్ షెడ్యూల్ వస్తే బండి సంజయ్ అక్కడ ఎన్నికల ప్రచారం లో పాల్గొంటారని వెల్ల‌డించారు. బండి సంజయ్ తో పాటు ప్రతి రోజు నడిచేందుకు 600 మంది కార్యకర్తలు నమోదు చేసుకున్నారని తెలిపారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

అయితే 300 మంది కి మాత్రమే ఏర్పాట్లు చేశామని.. 3 వందల మందికే రాత్రి బస ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. ఈ యాత్ర ప్రారంభానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, అరుణ్ సింగ్ , డీకే అరుణ, లక్ష్మణ్, మురళి ధర్ రావు లు పాల్గొంటారన్నారు. భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయం నుండి యాత్ర ప్రారంభం కానుంద‌ని చెప్పారు. ప్రభుత్వ నిర్బందాలకు, అవినీతి కి వ్యతిరేకంగా.. బీజేపీ అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా బండి సంజయ్ పాద యాత్ర కొన‌సాగుతుంద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news