సిఎం కెసిఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

సిఎం కెసిఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భ్రుతి పై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు బండి సంజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బండి సంజయ్… రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ భ్రుతిపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రచారం చేసిన కేసీఆర్, తన కుటుంబం, వారి బంధువు లకు డజను ఉద్యోగాలిచ్చారని బండి సంజయ్ విమర్శలు చేశారు. నిరుద్యోగ భ్రుతి కింద విద్యావంతులైన యువతీ, యువకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుద్యోగికి రూ.లక్ష బకాయి పడ్డారని.. నిరుద్యోగ భ్రుతి కింద ఇవ్వాల్సిన రూ. లక్ష ను నిరుద్యోగ యువతీ యువకులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.