Breaking : బండి సంజయ్ ఫోన్ మిస్సింగ్.. పోలీసులకు ఫిర్యాదు

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ మిస్ కావడం జరిగింది. ఈ నేపథ్యం లో ఆయన ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ ద్వారా కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు బండి సంజయ్. తన ఫోన్ కనబడటం లేదని, అరెస్ట్ చేసే క్రమంలో పడిపోయిందంటూ ఫిర్యాదులో తెలిపారు. ఫోన్‌లో కీలక సమాచారం ఉందని వెల్లడించారు. తన ఫోన్‌ను వెతికిపెట్టాలని పోలీసులను కోరారు బండి సంజయ్.

పోలీసుల వద్దే తన ఫోన్ ఉందని, జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తన ఫోన్‌తో పోలీసులకు ఏం పని? అంటూ బండి సంజయ్ అడిగారు. తనను కరీంనగర్‌లో అరెస్ట్ చేసి సిద్దిపేటకు తీసుకెళ్లే సమయంలో పోలీసుల వెహికల్‌లో తన ఫోన్ మిస్ అయిందని కంప్లైంట్‌లో తెలియచేశారు. తన ఫోన్ పోలీసుల దగ్గరే ఉందని, పోలీసుల మీదే తనకు అనుమానం ఉందన్నారు అన్నారు ఆయన. తన ఫోన్‌ను వెంటనే తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు సేకరించేందుకు తన ఫోన్‌ను పోలీసులు తీసుకున్నారని, పోలీసులకు కూడా ఈ విషయం తెలుసని బండి సంజయ్ అంటున్నారు. తన ఫోన్ మిస్సింగ్‌పై అప్పుడే తాను పోలీసులకు సమాచారం ఇచ్చానని అన్నారు. పోలీసులు తన ఫోన్‌ను అప్పగించడం లేదని, విచారణకు సహకరించడం లేదని కోర్టులో ఆరోపించారని తెలిపారు . పోలీసులే తన ఫోన్‌ను తన వద్దనుండి లాక్కున్నారని చెబుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version