రాష్ట్ర అభివృద్ధిపై చర్యకు సిద్ధమా.. బీజేపీ నేతలకు తలసాని సవాల్

-

ఆదివారం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక డివిజన్ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పాల్గొని మాట్లాడారు. అక్కడ ప్రసంగిస్తూ, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ‌ అన్నారు మంత్రి తలసాని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు ఆయన. రాష్ట్ర అభివృద్ధిపై చర్యకు సిద్ధమా అంటూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలకు సవాలు విసిరారు మంత్రి తలసాని.

అంబర్ పేట ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్ పేట కు అసలు ఎటువంటి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశంలో కేసీఆర్‌ ను ఢీ కొట్టగల నాయకుడు లేరని స్పష్టం చేసారు మంత్రి తలసాని.
రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు మాని ఢిల్లీ నుంచి నిధులు తీసుకువచ్చే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా?అని అడిగారు. మతాలు, కులాల పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబర్‌పేట్‌లో ఎమ్మెల్యే గా ఒడినందునే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారని హేళన చేశారు మంత్రి తలసాని.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version