బిడ్డా కేసీఆర్ గుర్తు పెట్టుకో…ఇప్పటి నుండి బండి సంజయ్ వేరు !

-

ముఖ్యమంత్రి కేసీఆర్ నా సహనాన్ని పరీక్ష చేస్తున్నాడు… బిడ్డా కేసీఆర్ గుర్తు పెట్టుకో…ఇప్పటి నుండి బండి సంజయ్ వేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆరెస్ కు రాజకీయ సమాధి దుబ్బాక నుండే మొదలవుతుందన్న ఆయన అధికారం శాశ్వతం కాదు కేసీఆర్ గుర్తు పెట్టుకోమని అన్నారు. దుబ్బాకలో ప్రచారంకు కేటీఆర్ వచ్చినా కేసీఆర్ వచ్చినా బిజేపీ గెలుపు ఖాయమని అన్నారు. తనపై పోలీసులతో దాడి చేస్తే మేము కూడా ప్రతి దాడి చేస్తామని అన్నారు.

దుబ్బాకలో ఓటమి భయం పట్టుకుంది కాబట్టి పోలీసులతో దాడులు చేయిస్తున్నారని అన్నారు. కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా కొమ్ము కొస్తున్నాయని, రాబోయే రోజుల్లో ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని అన్నారు. పోలీసులకు ఏదో ప్రమోషన్ లు వస్తాయని ఇలాంటి నీచ పనులకు పాల్పడవద్దన్న అయన తక్షణమే సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీపీ పై కేంద్ర హోంశాఖను కలిసి పిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. మా దమ్ము మా ధైర్యం ఏందో త్వరలోనే చూపిస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news