తెలంగాణ రాష్ట్రాన్ని దళిత ద్రోహి పాలిస్తున్నారని.. పేదల పాలిట యముడిలా తయారయ్యాడని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బండి సంజయ్. అంబేద్కర్ వర్ధంతి, జయంతి వేడుకలు గుర్తు రావా కేసీఆర్ కి..!? ముఖ్యమంత్రి ఏమి పీకుతున్నారు మీరు అంత బిజీగా ఉన్నారా..!? ఫాంహౌస్ లో బిజీగా ఉన్నావా..!? అంటూ నిప్పులు చెరిగారు. ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు బండి సంజయ్ , ఎంపీ అరవింద్ పలువురు నాయకులు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి తో ముందుకు వెళ్దామని.. .బాబాసాహెబ్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. అంబేద్కర్ వర్ధంతి, జయంతి వేడుకలు గుర్తు రావా కేసీఆర్ కి..!? ముఖ్యమంత్రి ఏమి పీకుతున్నారు మీరు అంత బిజీగా ఉన్నారా..!? ఫాంహౌస్ లో బిజీగా ఉన్నావా..!? అంటూ నిప్పులు చెరిగారు. అంబేద్కర్ వర్ధంతి, జయంతికి ఆయన విగ్రహానికి పూలమాలలు ఎందుకు వేయరో చెప్పాలని… “దళిత బంధు” ఇస్తా అన్నావు. మూడెకరాల భూమి ఇస్తా అన్నావు…అన్ని అబద్ధాలేనని ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో మాత్రమే “జై భీమ్”, “జై దళితులు” అంటావని… ముఖ్యమంత్రి కెసిఆర్ భారతీయులకు , తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
—-