గవర్నర్ తమిళి సై ని బీజేపీ వ్యక్తిగా టీఆర్‌ఎస్ చిత్రికరిస్తోందని బండి సంజయ్ ట్వీట్ చేశారు. గవర్నర్ తమిళి సై పై టీఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. తెలంగాణ గవర్నర్ తమిళ్ సై నిజాలు మాట్లాడుతున్నారని.. టి ఆర్ యస్ పార్టీ గవర్నర్ వ్యవస్థ ను కించపరుస్తుందని మండిపడ్డారు.
తమిళ్ సై పై బీజేపీ ముద్ర వేస్తున్నారని… కల్వకుంట్ల రాజ్యాంగం బ్యాచ్ నుండి ఎక్కువ ఆశించలేమన్నారు. టీఆర్‌ఎస్ గొర్రెలు మహిళలను గౌరవించడం గానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించడం గానీ చేయడం లేదు… కల్వకుంట్ల రాజ్యాంగ ప్రతిపాదకుల నుంచి ఇంకా ఏం ఆశించగలం? అని ఆగ్రహించారు.
గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ భారత రాజ్యాంగం యొక్క ఆదర్శాలను అమలు చేయాలని, గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించాలని, ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని అడుగుతున్నారన్నారు. తమిళిసై వాస్తవాలను మాట్లాడారని.. కానీ టీఆర్‌ఎస్ గవర్నర్‌ను బీజేపీ వ్యక్తిగా ముద్రవేసి, టీఎస్ ప్రథమ పౌరుడిని అవమానిస్తోందని మండిపడ్డారు.