ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి !

అనేక హిందీ మరియు గుజరాతీ సినిమాలలో నటించిన నటుడు అమిత్ మిస్త్రీ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈ నటుడు క్యా కెహ్నా, ఏక్ చాలిస్ కి లాస్ట్ లోకల్, 99, షోర్ ఇన్ ది సిటీ, యమలా పాగ్లా దీవానా, బే యార్, ఎ జెంటిల్ మాన్ మరియు అమెజాన్ ప్రైమ్ సిరీస్ బ్యాండిష్ బండిట్ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 

అమిత్ మిస్త్రీ మరణానికి సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (సింటా) సంతాపం తెలిపింది. అసోసియేషన్ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నటుడికి నివాళి అర్పించింది. ఆయన 2004 నుండి సభ్యుడని ట్వీట్ లో పేర్కొన్నారు.  అమిత్ మిస్త్రీకి పలువురు బాలీవుడ్, టీవీ నటులు సోషల్ మీడియాలో నివాళి అర్పిస్తున్నారు. ప్రతిభావంతుడైన నటుడి ఆకస్మిక మరణం గురించి తెలుసుకున్నందుకు బాధగా ఉందని నటులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.