తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మే 15 నుంచి అంటూ సోషల్ మీడియాలో ఒకటి రెండు రోజుల నుంచి ఉత్తర్వులు వైరల్ అవుతున్నాయి. అయితే అది నకిలీ ఉత్తర్వులు పత్రాలని తేలింది. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ఫిర్యాదు చేశారు. ఇప్పటి దాకా పరీక్షలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని, ఇంటర్ పరీక్షల నిర్వహణకు జూన్ మొదటి వారం నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మే 15న ఇంటర్ పరీక్షలు అనే ఉత్తర్వులు కాపీ నకిలీదని తేల్చి చెప్పారు ఆయన. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. విధ్యార్దుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని, దీనిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని బోర్డు అధికారులు చెబుతున్నారు.