రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డిపై మరోసారి టాలీవుడ్ నిర్మాత బండ గణేష్ ఫైర్ అయ్యారు. నిన్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ… ఎల్లో మీడియా అధినేతలతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు విజయసాయి.
“ఎల్లో మీడియా ముఖ్యులు తమ వ్యాపార విబేధాలను పక్కనపెట్టి ఏకమయ్యారు. రాధాకృష్ణ, TV5 నాయుడు, CVR సివి రావు, స్వయం ప్రకటిత మీడియా కింగ్ రవిప్రకాశ్ అర్థరాత్రి తాజ్ కృష్ణాలో రాహుల్ ను కలిశారు. ప్రధాని మోదీని ఎలా దింపొచ్చో క్షుద్ర వ్యూహాలతో బాబు కోసం ఈ దళారీ వ్యవహారాన్ని నడిపారు.” అంటూ రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే.. దీనిపై మండిపడ్డ బండ్ల గణేష్.. కౌంటర్ ఇచ్చారు. “ఆచార్య హరగోపాల్, గద్దర్, ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం, కంచె ఐలయ్య, చెరుకు సుధాకర్, జహీర్ అలీ ఖాన్ గారు రాహుల్ గాంధీని కలిశారు సార్.. వారు కూడా ఎల్లో మీడియానేనా.. ? “అంటూ కౌంటర్ ఇచ్చార బండ్ల గణేష్.
ఆచార్య హరగోపాల్, గద్దర్, ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం, కంచె ఐలయ్య, చెరుకు సుధాకర్, జహీర్ అలీ ఖాన్ గారు రాహుల్ గాంధీని కలిశారు సార్.. వారు కూడా ఎల్లో మీడియానేనా.. ? https://t.co/kYUHkOIJC2
— BANDLA GANESH. (@ganeshbandla) May 8, 2022