ప్రకాష్ రాజ్ కు షాక్ : మంచు విష్ణు ప్యానల్ కు బండ్ల గణేష్ మద్దతు !

మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల కు కౌంట్ డౌన్ దగ్గరపడుతున్న కొద్దీ… ఈ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. రేపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో… ఒక్కో సెలబ్రిటీ… తమ సోషల్ మీడియా వేదికగా… ఆయా ప్యానల్ సభ్యులకు ఓటు వేయాలంటూ కోరుతున్నారు. అటు ప్యానెల్ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

దీంతో మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు… రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ నిర్మాత బండ్ల గణేష్.. చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. మంచు విష్ణు ప్యానల్ లో ఉన్న సభ్యుడు నటుడు రఘు బాబు కు ఓటు వేయాలని మా సభ్యులను కోరాడు బండ్ల గణేష్. “మా సభ్యులకు విన్నపం దయచేసి మీ అమూల్యమైన ఓటు జనరల్ సెక్రెటరీగా రఘు బాబు వేసి గెలిపించ వలసినదిగా నా ప్రార్థన మీ బండ్ల గణేష్” అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. దీంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల్లో కొత్త అలజడి రేగింది. కాగా మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు బండ్ల గణేష్ మద్దతు పర్యటించిన సంగతి తెలిసిందే.